కరీంనగర్: జిల్లా హుజూరాబాద్‌ను పీవీ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావాలని ఇవాళ పీవీ సేవా సమితి, ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. హుజూరాబాద్ పీవీ జిల్లాగా ఏర్పాటు కావాలని నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుంచి పీవీ విగ్రహం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.