టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి ప్రమోదిని(Actress Pramodini) తల్లి క్యారెక్టర్ల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలో తన ఇంటర్వ్యూలో భాగంగా వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. అంతేకాదు తల్లి క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నారో కూడా ఓ కారణం తెలిపారు. అయితే ప్రతి సినిమాలో అమ్మ పాత్రలు ఉంటాయని, ఆ క్రమంలో ఈ క్యారెక్టర్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుందని ఆమె అన్నారు. అందుకే ఈ పాత్రలు ఎక్కువగా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతోపాటు వదిన, సోదరి, పిన్ని పాత్రలు కూడా చేశానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ క్యారెక్టర్ రోల్స్ ఇచ్చినా కూడా చేసేందుకు తాను సిద్ధమని వెల్లడించారు.
వారి తల్లిదండ్రులు కోరిక మేరకు మొదట డాన్స్ నేర్చుకున్నానని ప్రమోదిని తెలిపారు. ప్రమోదిని అమ్మ క్లాసికల్ డాన్సర్ కాగా.. నాన్నకు కళలు అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే తాను ఇలా యాక్టింగ్ వైపు రావాల్సి వచ్చిందన్నారు. అంతేకాదు తాను పెళ్లి చేసుకునే వ్యక్తిని సైతం సినిమాలపై ఆసక్తి ఉన్న వ్యక్తినే ఎంపిక చేసి తన పేరెంట్స్ మ్యారేజ్ చేశారని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈ రంగంలో రాణించడం చాలా కష్టమని స్పష్టం చేశారు. ఇంకా ఏం విశేషాలు చెప్పారో తెలియాలంటే మాత్రం పూర్తి వీడియో చూడాల్సిందే.