NZB: నందిపేట్ మండలం వెల్మల్‌లో బుధవారం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌పై యుద్ధం – ప్రజా ఆరోగ్యానికే సిద్ధం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నందిపేట్ ఎస్సై-2 రాము హాజరై ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతుందని సూచించారు. క్యాన్సర్ వంటి రోగాలు ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ భూమిలో కరగదన్నారు.