కృష్ణా: మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌కు మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావు పేరు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు జీవో జారీ చేసింది. సమాజ సేవ, ప్రజా జీవితంలో ఆయన అందించిన విశేష సేవలకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా మత్స్యకారుల అభ్యున్నతి, తీర ప్రాంతాల అభివృద్ధి కోసం నరసింహరావు కృషి చేశారని ప్రభుత్వం తెలిపింది.