NLR: గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలో అధికారులతో సమావేశమైన ఆయన ప్రస్తుత పనుల పురోగతి, భూసేకరణ స్థితిగతులపై ఆరా తీశారు. డ్రెడ్జింగ్, బెర్త్ వర్క్స్, ఆన్ప్లర్ వర్క్స్, రైల్వే లైన్ నిర్మాణం, రోడ్డు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.