టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యాడు. తన భార్య విద్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ విషయం తెలియడంతో సహచర క్రికెటర్లు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, రాయుడు-విద్యలకు 2009లో వివాహం జరగ్గా, ఇప్పటికే వీరికి ఒక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.