కాకినాడ దేవాలయం వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ఆలయ ఈవో రాజేశ్వరరావు ప్రారంభించారు. వేద పండితులు స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనలు, పూజలు చేశారు. భక్తులకు సిబ్బంది ప్రసాద వితరణ చేశారు.