ఈ ఏడాది IPLలో రాజస్థాన్ రాయల్స్ జట్టును రవీంద్ర జడేజా నడిపించనున్నాడు. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్ CSKకు వెళ్లిపోవడంతో, నూతన సారథిగా జడేజాను రాజస్థాన్ యాజమాన్యం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ RR తన సోషల్ మీడియా వేదికగా జడేజా ఫొటోను పోస్ట్ చేసింది. దానికి ‘దళపతి’ అనే టాగ్‌ను జోడించి తమ కొత్త కెప్టెన్‌కు ఘనస్వాగతం పలికింది.