అమెరికాలోని మసాచుసెట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. కేప్కాడ్ ప్రాంతంలోని ప్రావిన్స్‌టౌన్ ఎయిర్‌పోర్టు వద్ద ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు. విమానం రన్‌వే సమీపంలో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రతికూల వాతావరణం కారణమా, సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది.