BHNG: జిల్లాలోని బస్వపురం ప్రాజెక్టులో నీళ్లు నింపాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సీఎంని కలిసి బసవపూర్ ప్రాజెక్ట్‌లోకి గోదావరి నీళ్ళని మళ్లించి నింపినట్లైతే ఉమ్మడి జిల్లాలో 4 నియోజకవర్గాలలో పంట పొలాలకు నీటి ఎద్దడి ఉండదని వివరించినట్టు చెప్పారు.