సికింద్రాబాద్ వారాసిగుడ (Warasiguda)లో దారుణం జరిగింది. మంచంపై ఉన్న వికలాంగురాలైన ఏడేళ్ల బాలికపై ఓ గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్(Secunderabad)లోని వికలాంగురాలు నివాసంలో ఎవరు లేనిది చూసి గుర్తు తెలియని వ్యక్తి ఈ దారుణానికి ఒడి కట్టినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో బాలిక తల్లి సమీపంలో ఉన్న కిరాణా షాప్ (Kirana shop) కి వెళ్ళింది.
సుమారు 30 నిమిషాల తర్వాత కిరాణా షాప్ నుంచి బాలిక తల్లి ఇంటికి చేరుకుంది. కుమార్తె లోపలి వస్త్రంపై రక్తపు మరకలను తల్లి గమనించింది. వెంటనే బాలికను ఆసుపత్రి(hospital)కి తరలించింది. అత్యాచారం జరిగిందన్న అనుమానంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం(POCSO Act)తో పాటు పలు సెక్షన్ల కింద వారసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి ఓడిగట్టిన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానితులను ఆరా తీస్తున్నారు.నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సీఐ శంకర్ తెలిపారు.