ATP: అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దాతలు భారీగా స్పందించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో శనివారం ఒకేరోజు రూ. 26,77,905 విరాళాలు అందజేశారు. ప్రభుత్వం 80 శాతం నిధులు మంజూరు చేయగా, మిగిలిన నిధులకు దాతలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. త్వరలో ఆలయ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.