AP: శ్రేయ ఇన్ఫ్రా సంస్థ మోసాలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ క్రమంలో తహశీల్దార్.. భూముల వివరాలను సీఐడీ అధికారులకు ఇచ్చారు. నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో శ్రేయ సంస్థ 51.55 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అధిక వడ్డీ ఇస్తామని ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించింది. హేమంత్ కుమార్, సంగీతరాయ్ పేర్లతో భూములు కొన్నట్లు విచారణలో వెల్లడైంది.