అన్నమయ్య జిల్లాలో 92 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. టైప్–3 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) 56, టైప్–4 కేజీబీవీల్లో 36 పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు జనవరి 11వ తేదీలోపు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.