JGL: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి సుజాత, ఉప వైద్యాధికారి నిర్వహించారు.