MHBD: ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ మద్దెల బిక్షపతి శుక్రవారం తొర్రూరు ఆర్టీసీ డీపో మేనేజర్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. గతంలో మా గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని, అనివార్య కారణాల వల్ల నిలిపివేశారని పేర్కొన్నారు. బస్సు రవాణాను పునరుద్ధరిస్తే చుట్టుపక్కల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.