HYD: GHMCలో విలీనమైన ప్రాంతాల్లో ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపులను ఇకపై పూర్తిగా ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని అధికారులు స్పష్టం చేశారు. నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేస్తూ, పారదర్శకత కోసం UPI, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌ను మాత్రమే అనుమతించనున్నారు. దీనివల్ల పన్ను చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం కానుంది.