ELR: పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. గత మూడు నెలలుగా తమ వేతనాలు పెండింగ్లో ఉన్నాయంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సూపర్వైజర్ లలితాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మీ, రమణ, రజనీ తదితరులు పాల్గొన్నారు.