KNR: ఇల్లంతకుంట మండలం లక్ష్మజీపల్లిలో శుక్రవారం సర్పంచ్ ముస్కే రేణుక అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో మద్యం అమ్మితే రూ. 10 వేల జరిమానా విధిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. మద్యం వల్ల పెరుగుతున్న కుటుంబ కలహాలు, గొడవలకు చెక్ పెట్టేందుకు కుల సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ విక్రయదారులను పట్టించిన వారికి రూ. 2 వేల పారితోషికం ఇస్తామని ఆమె తెలిపారు.