JNG: మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు BRS అగ్రనేత, సిద్దిపేట MLA హరీష్ రావును ఇవాళ శాసనసభలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక కావడం పట్ల వారు హరీష్ రావుకు అభినందనలు తెలిపారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు.