TG: జీహెచ్ఎంసీ బిల్లులో క్లారిటీ లేదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా బిల్లు ఉందని తెలిపారు. వికేంద్రీకరణ చేయాల్సిన సమయంలో పరిపాలన కేంద్రీకరణతో ఎలాంటి లాభం ఉండదని సభ దృష్టికి తీసుకొచ్చారు.