NLG: దేవరకొండ మున్సిపాలిటీకి సంబందించి విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వస్కుల సుధాకర్ శుక్రవారం తెలిపారు. వేరే గ్రామాలకు సంబంధించిన ఓటర్లను దేవరకొండ మున్సిపాలిటీలో నమోదు చేయడం జరిగిందని అన్నారు. మున్సి పల్ కమిషనర్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.