KMR: మాచారెడ్డి మండల కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పిస్తామని, సర్పంచ్ వినోద ప్రభాకర్ చెప్పారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, భక్తులు ఉన్నారు.