JGL: కొండగట్టు అంజన్న సన్నిధిలో పౌర్ణమి పురస్కరించుకుని శనివారం 36వ గిరిప్రదక్షిణను ఉదయం 6 గంటలకే నిర్వహిస్తామని సంకల్పకర్త సురేశ్ ఆత్మరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా గిరిప్రదక్షిణను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. 2026 సంవత్సరంలో తొలి గిరిప్రదక్షిణ అని వారు తెలిపారు.