భారత సుప్రీంకోర్టు 2025లో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులను పరిష్కరించిన న్యాయస్థానంగా నిలిచింది. గతేడాది 75,280 కొత్త కేసులు రాగా.. ఏకంగా 65,403(87%) కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించింది. US, బ్రిటన్ కోర్టుల కంటే ఇది ఎంతో మెరుగైన ఫలితం. అయితే, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఈ వేగం పుంజుకోవడం విశేషం.