కామారెడ్డి జిల్లా పిట్లం సిహెచ్సీలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం పిట్లం సిహెచ్సీలు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పరిశీలించి మందులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.