MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామంలో శుక్రవారం ‘డ్రై డే ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ప్రజలకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, నీటి నిల్వలను తొలగించి డెంగీ, చికెన్ గున్యా జ్వరాల వ్యాప్తిని అరికట్టాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.