KMM: జనవరి 3 నుంచి 20 వరకు ఖమ్మంలో టీజీ టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సీపీ సునీల్ దత్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.