BHPL: మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాంతంలో పట్టణ BRS అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ‘బస్తీ బాట’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ MLA గండ్ర వెంకట రమణా రెడ్డి, జిల్లా BRS అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వార్డు ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.