VSP: మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని కంచరపాలెం ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు పంజాబ్ హోటల్ జంక్షన్ సాయి నగర్ సర్వీస్ రోడ్డు వద్ద మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌ను శుక్రవారం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన పలువురుకి జరిమానాలు విధించారు.