KMR: మద్నూర్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రంలో 7,916 రైతుల నుంచి 1,23,417 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ప్రైవేటులో 13,743 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ప్రైవేటులో కంటే సీసీఐ కేంద్రంలోనే ధర ఎక్కువగా ఉండటంతో అమ్మకానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు.