‘స్వచ్ఛ నగరం’గా పేరున్న ఇండోర్ ఇప్పుడు విషాదానికి వేదికైంది. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణాలు తీసింది. కలుషిత నీరు తాగి 11 మంది మృత్యువాత పడగా, 1400 మంది ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై పలువురు స్పందిస్తూ.. ‘తాగడానికి మంచి నీరు కూడా ఇవ్వలేని పాలకులు.. అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఓట్లు వేసి గెలిపించింది ప్రాణాలు తీయడానికా?’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు.