MNCL: సీపీఐ శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈనెల 3న తాండూరు మండలంలో నిర్వహించనున్న జీపు జాతను విజయవంతం చేయాలని మండల కార్యదర్శి కొండ బానేష్ పిలుపునిచ్చారు. జీపు జాతకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ జాత మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తుందన్నారు.