JGL: ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పోలీసుల కృషి అభినందనీయమని, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీసు శాఖలో విశేష సేవలందించినందుకు జగిత్యాల జిల్లాలో 15 మంది అధికారులు, సిబ్బంది ప్రతిష్ఠాత్మక సేవా పతకాలకు ఎంపికయ్యారని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మామిడిపల్లి శ్రీనివాస్, హరి చంద్ర సురేష్‌లు ఎంపికయ్యారు.