EG: సీపీఐ (ఎంఎల్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. 2025లో పేదల హక్కుల కోసం సాగిన పోరాటాలను గుర్తు చేస్తూ, 2026లో వాటిని సాధించే దిశగా పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు.