ఇండోనేషియాలో జనవరి 2 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. పెళ్లికి ముందు సెక్స్ చేస్తే వారికి ఏడాది వరకు ప్రభుత్వం జైలు శిక్ష విధించనుంది. భాగస్వామితో కాకుండా వేరేవారితో శృంగారంలో పాల్గొంటే వారిని వ్యభిచార నేరం కింద శిక్షించనుంది. అయితే దీనిపై వారికి సంబంధించిన ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే అధికారులు కేసు నమోదు చేస్తారు.