ప్రకాశం: ఒంగోలులో నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కార్యక్రమానికి సంబంధించి ఆవిష్కరించిన శిలాఫలకం శుక్రవారం తెల్లవారుజామున నేలకొరిగినట్లు స్థానికులు గుర్తించారు. శిలాఫలకం సహజ కారణాలతో కూలిందా, లేక ఎవరో కావాలనే పడగొట్టారా అన్న అంశంపై టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ శ్రీనివాసరావు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు.