బంగ్లాదేశ్‌లోని ఉద్రిక్తతపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. హమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కలిక ప్రభుత్వం అపరిమిత అవినీతి, వ్యకిగత ప్రయోజనాల కోసం ఆ దేశాన్ని చీకటిలోకి నెట్టేసిందని ఆరోపించారు. దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. పరిస్థితులు మరింత దిగజారకుండా జాగ్రత్త పడాలని, దేశాన్ని కాపాడుకునేందుకు బంగ్లా ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.