TG: ఖమ్మం బురాన్పురంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. దీంతో నారాయణరావు దంపతులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. గ్యాస్ లీకేజ్ వల్ల పేలుడు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ఇళ్లలోని తలుపులు, కిటికీలు పగిలిపోయాయి.