TG: మూసీ ప్రక్షాళనకు రెండేళ్లలో ఎన్నో సమీక్షలు జరిపామని సీఎం రేవంత్ అన్నారు. వరద ముప్పును తప్పించేందుకు నిజాం నవాబులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిర్మించారని గుర్తుచేశారు. వికారాబాద్ అడవుల్లో వనమూలికలను నిజాం పెంచారన్నారు. ఫాంహౌజ్‌లు కట్టి డ్రైనేజీలు తీసుకెళ్లి గండిపేటలో కలిపారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫాంహౌజ్‌లపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు.