TG: మూసీ నది అనంతగిరిలో మొదలై వాడపల్లి వద్ద కృష్ణాలో కలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపు 240 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందన్నారు. రెండు నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈసాకు హిమాయత్‌సాగర్, మూసీకి ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టులు ఉన్నాయని, రెండు నదులు లంగర్ హౌస్ బాపూఘాట్ వద్ద కలుస్తాయన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుందన్నారు.