TG: హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్ఘీస్ రికార్డు సృష్టించాడు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అతనికి ఆప్టివర్ సంస్థ రూ.2.5 కోట్ల భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ తర్వాత ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్‌గా ఈ జాబ్ వరించింది. ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. 2017 నాటి రూ. కోటి రికార్డును వర్ఘీస్ బద్దలు కొట్టాడు.