TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వాపురం మండలం మొండికుంటలో KLR ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.