NZB: టీయూలో పని చేసే సిబ్బందికి డిసెంబర్ నెల జీతం వారి ఖాతాలో జమైంది. పడిన జీతాలు అంతలోనే వెనక్కి వెళ్లాయి. ఖజానా శాఖ నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులను ఎవరూ డ్రా చేయవద్దని రిజిస్ట్రార్ యూనివర్సిటీ సిబ్బందికి సూచించారు. వాస్తవానికి యూనివర్సిటీ ఉద్యోగుల హాజరు పరిశీలించి జీతాలు వేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యల వల్ల పొరపాటు జరిగిందన్నారు.