స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో ఘోర విషాదం జరిగింది. క్రాన్స్-మోంటానా రిసార్ట్‌లోని బార్లో జరిగిన అగ్నిప్రమాదంలో 47 మంది సజీవదహనమయ్యారు. మరో 115 మందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. పరిమిత స్థలంలో మండే పదార్థాల వల్లే ‘ఫ్లాష్ ఓవర్’ జరిగి మంటలు వ్యాపించాయి. దేశ చరిత్రలోనే ఇది భారీ విషాదం.