BDK: భద్రాద్రి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ విద్యా చందన తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంలో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు ఈనెల 11 నుంచి 21వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కులం, జన్మదిన, బోనఫైడ్, పాస్పోర్టు సైజ్ ఫోటో, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు.