KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సహకారం, పార్టీ కార్యకర్తల కృషితోనే అభివృద్ధి సాధ్యమని, నూతన సంవత్సరం ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ, వార్డు నాయకులు, పోలీసులు పాల్గొన్నారు.