ఫ్లెక్సీ గొడవ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్తే.. తనపై కాల్పులకు యత్నించారని మాజీమంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అభివృద్ధి చేయకుండా, వాల్మీకి విగ్రహం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భరత్ తండ్రి నారాయణ రెడ్డి పెద్ద నేరస్థుడని, కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ రౌడీల సామ్రాజ్యాన్ని నిర్మిస్తోందని గాలి ఆగ్రహం వ్యక్తం చేశారు.