MHBD: తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని ఆయా గ్రామాల్లో యాసంగి సాగు ప్రారంభమైంది. వానకాలం సీజన్లో పంట సాగు నుంచి కొనుగోలు వరకు అనేక ఇబ్బందులు పడి అంతంత మాత్రంగా దిగుబడి పొందిన రైతులు గంపేడు ఆశతో మరోసారి యాసంగి సీజన్లో మొక్కజొన్న, వరి, పత్తి వంటి పంటలను సాగు చేస్తున్నారు. రైతులు తమ వ్యవసాయ పనుల్లో యాసంగి సాగుకు బిజీ బిజీగా గడుపుతున్నారు.