కాకినాడ: పులివెందులలో జరిగిన సౌత్ జోన్ హాకీ పోటీల్లో సత్తా చూపిన ఘనత పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రాపర్తి కృష్ణ కుమార్తె సత్య శ్రీలక్ష్మికే దక్కింది. సౌత్ జోన్ హాకీ లీగ్-2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున సత్య శ్రీలక్ష్మి పాల్గొన్నారు. గురువారం పులివెందుల డీఎస్పీ మురళీ ధరన్ చేతుల మీదుగా సత్య శ్రీలక్ష్మీ పురస్కారం అందుకున్నారు.